వాహనాల అడ్వాన్స్‌ అక్రమాలపై సీఐడీ విచారణ 

16 Dec, 2022 06:00 IST|Sakshi

అధికారులకు మంత్రి మేరుగు నాగార్జున ఆదేశం  

సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వివిధ రకాల వాహనాలు సరఫరా చేయడానికి ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి కోట్లాది రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకుని వాహనాలను సరఫరా చేయని డీలర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతోపాటుగా సీఐడీ విచారణ చేయించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు.

తాడేపల్లిలోని ఎస్సీ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన 11వ కమిటీ ఆఫ్‌ పర్సన్స్‌ (సీఓపీ) సమావేశంలో మంత్రి నాగార్జున పలు అంశాలపై సమీక్షించారు. ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చి వివిధ జిల్లాల్లో ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు(ఈడీ)గా పనిచేస్తున్న వారిలో ఏడాదికాలం సర్వీసును పూర్తి చేసిన వారిని సొంత శాఖలకు వెనక్కు పంపాలని మంత్రి ఆదేశించారు.  

మరిన్ని వార్తలు