మ‌రో రెండురోజుల పాటు భారీ వ‌ర్షాలు

15 Sep, 2020 10:31 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమీపంలో ఏర్పడిన  అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు, అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.  సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు 3 నుంచి 3.4 మీటర్ల ఎత్తు వరకూ ఎగసి పడతాయని అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయనీ, మత్స్యకారులెవ్వరూ సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. (ఏపీలో హోరెత్తిన వాన)

మరిన్ని వార్తలు