9న అల్పపీడనం.. మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

7 Nov, 2022 03:21 IST|Sakshi

సాక్షి, అమరావతి/ సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో 9న ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దక్షిణ కోస్తా, రాయలసీమపై కొద్దిపాటి ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అధికారుల అంచనా. శ్రీలంక తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం.. వాయువ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది.

48 గంటల్లోనే బలహీనపడి పుదుచ్చేరి, చెన్నై మధ్య 11, 12 తేదీల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం తమిళనాడు చెన్నై పైనే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఏపీలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కెల్లా కర్నూలులో అత్యధికంగా 33.8(+2.2) డిగ్రీల పగటి ఉష్ణోగ్రత రికార్డయింది.  

మరిన్ని వార్తలు