-

CM YS Jagan: థాంక్యూ సీఎం సార్‌ !

21 Aug, 2022 17:48 IST|Sakshi
ప్లకార్డులు చేతబూని సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఎంఎల్‌హెచ్‌పీలు

గుంటూరు మెడికల్‌ : కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌వో) హోదా కల్పించినందుకు కృతజ్ఞతగా శనివారం గుంటూరు కన్నావారితోటలో పలువురు మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు (ఎంఎల్‌హెచ్‌పీ) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.  ఈ సందర్భంగా అసోసియేషన్‌ జిల్లా గౌరవ అధ్యక్షురాలు తమనంపల్లి ప్రవల్లిక, జిల్లా కార్యదర్శి పులి ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తమను నియమించిందని తెలిపారు. 14 రకాల వైద్య పరీక్షలు చేసి 67 రకాల మందుల్ని ప్రజలకు అందిస్తున్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభిస్తున్న ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమంలో తమకు కీలకమైన బాధ్యతల్ని రాష్ట్ర ప్రభుత్వం అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం అయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్స్‌లో తమను నియమించి మెరుగైన వైద్య సేవల్ని గ్రామీణ ప్రజలకు అందిస్తోందని వివరించారు. తమకు సీహెచ్‌ఓ హోదా కల్పించిన ముఖ్యమంత్రికి  రుణపడి ఉంటామని, బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించి గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సహ కార్యదర్శి నరేష్‌బాబు, ఉపాధ్యక్షులు అనుపమ, షైనీ మేఘన, శ్రీవాణి, కోశాధికారి మౌనిక, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పలువురు ఎంఎల్‌హెచ్‌పీలు పాల్గొన్నారు.
(చదవండి: నాటుకోడికి ఫుల్‌ గిరాకీ.. ఆ రుచే వేరబ్బా.. ఎంత ఆరోగ్యమో తెలుసా..? )

మరిన్ని వార్తలు