నవంబర్‌ 23 నుంచి సూర్యలంకలో మిలిటరీ శిక్షణ

13 Oct, 2020 04:40 IST|Sakshi

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకలో వచ్చే నెల 23వ తేదీ నుంచి డిసెంబర్‌ 4వ తేదీ వరకు 12 రోజుల పాటు రక్షణ శాఖ ఆధ్వర్యంలో మిలిటరీ శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిస్తున్నట్లు సాధారణ పరిపాలన (రాజకీయ) ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యలంకలోని ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌ వద్ద జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఫైరింగ్‌ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

అంతేకాకుండా ఆరు నుంచి ఎనిమిది ఎయిర్‌ క్రాఫ్ట్‌లు ఇందులో పాల్గొననున్నాయి. శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే సూర్యలంక చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు ప్రమాదకర ప్రాంతంగా పేర్కొంటూ ప్రవీణ్‌ ప్రకాశ్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.  

మరిన్ని వార్తలు