దివాకర్ రెడ్డి మైనింగ్ సంస్థలకు షోకాజ్ నోటీసులు

10 Oct, 2020 17:35 IST|Sakshi

సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మైనింగ్ కేసు నమోదైంది. జేసీ సంస్థల్లో అక్రమాలు గుర్తించిన మైనింగ్ అధికారులు జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. ముచ్చుకోటలో రెండు డోలమైట్ మైనింగ్ క్వారీలను జేసీ దివాకర్‌ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ రమణారావు తెలిపారు. సుమన, భ్రమరాంబ సంస్థల పేరుతో మైనింగ్ నిర్వహిస్తున్న జేసీ దివాకర్ రెడ్డి కార్మికుల భద్రతను గాలికొదిలేశారని ఆయన పేర్కొన్నారు. చదవండి: మా వాళ్లు రాక్షసులు.. మీ రక్తం తాగుతారు: జేసీ

మినరల్ మేనేజర్ పర్యవేక్షణలో మైనింగ్ పనులు జరగడం లేదని, నిబంధనలు పాటించని మైనింగ్ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన రెండు క్వారీల్లో ఉల్లంఘన జరిగిందని, ఉన్నతాధికారులకు నివేదిక పంపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్వీ రమణారావు స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు