ఏపీలో సత్ఫలితాలిస్తోన్న మైనింగ్‌ సంస్కరణలు

1 Apr, 2022 19:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మైనింగ్‌ రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు సత్ఫలితాలిస్తున్నాయి. గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యవేక్షణలో నూతన విధానాలకు రూపకల్పన చేశారు. పారదర్శకతతో అక్రమాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయడంతో ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఖనిజ ఆదాయంలో గనుల శాఖ సరికొత్త రికార్డు నెలకొల్పింది.

చదవండి: ఏపీ: రిజిస్ట్రేషన్లలో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ రికార్డ్‌

2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.3765 కోట్ల ఆదాయం వచ్చింది. 60 శాతం వృద్ధి రేటుతో గత ఏడాది కన్నా అదనంగా రూ.1425 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లీజు అనుమతులు మరింత సరళతరం చేస్తూ ప్రభుత్వం నూతన నిబంధనలను తీసుకొచ్చింది. తద్వారా లీజులు పొంది.. ఏళ్ల తరబడి క్వారింగ్‌  చేయకుండా నిర్లక్ష్యం చేసే విధానానికి స్వస్తి పలికారు. ముఖ్యంగా లీజుల కేటాయింపులో ప్రభుత్వం అత్యంత పారదర్శకత పాటిస్తుందని గనుల శాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డి చెప్పారు.


మరిన్ని వార్తలు