పేద విద్యార్థులకు సాంకేతిక విద్య..

4 Jan, 2021 18:33 IST|Sakshi

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, నూజివీడు: గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో సోమవారం ఉదయం జనరల్ కౌన్సెలింగ్ ప్రక్రియను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎంట్రన్స్ పరీక్షల్లో 1,2,3, స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మంత్రి సురేష్, స్థానిక ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, ఛాన్స్‌లర్ కేసీరెడ్డి అడ్మిషన్ సర్టిఫికేట్లు అందజేశారు.(చదవండి: గవర్నర్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ)

ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విలువలతో కూడిన విద్యనందించేందుకు ట్రిపుల్ ఐటీ లకు ఏడాదికి 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో త్వరలో  స్కిల్‌ డవలప్‌మెంట్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.(చదవండి: ఆలయాలపై దాడులు: ఏపీ సర్కార్‌ సీరియస్‌)

చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీలను నిర్వీర్యం చేశారన్నారు. ట్రిపుల్ ఐటీలకు చెందిన రూ.188 కోట్ల నిధులను పసుపు-కుంకుమ పథకానికి మళ్లించి చంద్రబాబు రాక్షస ఆనందం పొందారన్నారు. అధ్యాపక సిబ్బంది సమస్యలపై గవర్నింగ్‌ కౌన్సిల్లో చర్చించి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి సురేష్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు