ప్రతిపక్షాల ఆరోపణలు అర్ధరహితం..

7 Dec, 2020 15:53 IST|Sakshi

మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: నివర్ తుపాను నష్టంపై అధికారులతో చర్చించామని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు, వరద బాధితులకు నష్ట పరిహారం అందించే క్రమంలో సమీక్ష నిర్వహించామని పేర్కొన్నారు. వరదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్ష జరిపారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు అర్ధరహితమన్నారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. (చదవండి: అక్కడ పొగడ్తలు.. ఇక్కడ తిట్లు)

జిల్లాలో ఎవరు ఊహించని విధంగా వెయ్యి రెట్లు నీటి ప్రవాహం సాగిందని.. బుగ్గవంక, అన్నమయ్య ప్రాజెక్టుల నుంచి అధిక స్థాయిలో నీరు చేరుకుందన్నారు. తుపాను ప్రభావంతో మృతి చెందిన వారికి సత్వరమే రూ.5 లక్షలు అందజేశామని, నష్టపోయిన ప్రతిఒక్కరినీ ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. జిల్లాలో 22 వేల మందికి 500 రూపాయలు అందజేశామని తెలిపారు. రైతులకు నష్ట పరిహారం అందించడంలో ప్రభుత్వం ముందుందని, ప్రతి రైతును ఆదుకుంటామని.. అధైర్య పడొద్దన్నారు. బుడ్డ, శనగ పంట పూర్తిస్థాయిలో నీట మునిగింది. జిల్లాలో 1.40 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. బుగ్గవంక సుందరీకరణకోసం ఇప్పుడు 30 కోట్లు, గతంలో ఇచ్చిన 20 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. బురేవీ, అర్నబ్ తుపాన్ల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదిమూలపు సురేష్‌ సూచించారు.(చదవండి: కొమ్మాలపాటి.. అవినీతి కోటి)

మరిన్ని వార్తలు