మారింది పేర్లు కాదు ఆలోచనా విధానం: ఆదిమూలపు సురేష్‌

16 Sep, 2020 16:14 IST|Sakshi

సాక్షి, ప్రకాశం: కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమేనని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. త్రిపురాంతకంలో బుధవారం రోజున వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'పథకాలు పేర్లు మారాయని టీడీపీ అంటోంది. మారింది పేర్లు కాదు ఆలోచన విధానం. పేదల అవసరాలను గుర్తెరిగి సీఎం వైఎస్‌ జగన్‌ పథకాల రూపకల్పన చేస్తున్నారు.  (దమ్ముంటే విచారణ చేయండి అన్నారు)

గతంలో టీడీపీ అన్ని పథకాల్లో అవినీతికి పాల్పడింది. గత ప్రభుత్వం 500 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం గర్భవతులు, బాలింతల కోసం అంతకంటే నాలుగు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తోంది. సంక్షేమ కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్న. గత ప్రభుత్వాలు కార్పొరేట్ కళాశాలలకు కొమ్ముకాస్తే వాటి విధానాలపై నియంత్రణ చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలని పట్టుబట్టిన వ్యక్తి జగనన్న. దీనిని అడ్డుకోవడానికి టీడీపీ కోర్టులకు వెళ్లి సంబరపడుతోంది' అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. (‘ఇంట్లోనే బాబు జైలు జీవితం గడుపుతున్నారు’)

మరిన్ని వార్తలు