అతిసార బాధిత కుటుంబాలకు రూ. 3లక్షలు: ఆళ్ల నాని

9 Apr, 2021 19:29 IST|Sakshi

పైప్‌లైన్‌ మార్చేందుకు రూ. 25లక్షలు

సాక్షి, కర్నూలు: గత కొద్ది రోజులుగా జిల్లాలో అతిసార వ్యాధి బారిన పడి పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అతిసారంతో మృతి చెదిన వారి కుటుంబాలకు 3 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. గోరుకల్లు వాసులను ఆదుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ‘‘గోరుకల్లులో పైప్‌లైన్‌ను మార్చేందుకు 25 లక్షల రూపాయలు కేటాయించాం. తాగునీటిని హైదరాబాద్‌, విజయవాడ ల్యాబ్‌కు పంపి పరీక్షలు చేయిస్తాం. గోరకల్లులో 24 గంటలు పని చేసేలా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తాం. డయేరియా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. అనారోగ్యం ఉన్నవారు ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలి. అక్కడ మంచి వైద్యం అదుతుంది’’ అని ఆళ్ల నాని తెలిపారు.

చదవండి: కరోనాపై ప్రత్యేక దృష్టి సారించాలి

మరిన్ని వార్తలు