ఆనందయ్య మందుపై అపోహలొద్దు: ఆళ్ల నాని

24 May, 2021 11:10 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: రాష్ట్రంలో బెడ్ల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జర్మన్ షెడ్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో 30 బెడ్లను ఏర్పాటు చేసి, ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌ కూడా అందుబాటులో ఉంచామని ఆళ్ల నాని పేర్కొన్నారు.

ఆనందయ్య మందు.. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు..
నాలుగు రోజుల క్రితం సీఎం జగన్ అధ్యక్షతన ఆనందయ్య మందుపై చర్చించామని, ఇప్పటికే కమిటీ వేసి పూర్తి స్థాయిలో అధ్యయనం జరుగుతోందని మంత్రి తెలిపారు. పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆనందయ్య మందుపై ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని..  ఎలాంటి అపోహలు వద్దని ప్రజలకు మంత్రి సూచించారు. టీడీపీ నేతలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని.. టీడీపీ నేతల తీరుపై ప్రజలు అసహ్యించుకుంటున్నారని మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు.

చదవండి: అంతేనా లోకేష్‌.. టీడీపీ నేతల ప్రాణాలకు విలువే లేదా!
‘పచ్చ’పేకలో ఖాకీ: ఎస్పీ జోక్యంతో బట్టబయలు 

మరిన్ని వార్తలు