ఆక్సిజన్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి: ఆళ్ల నాని

18 May, 2021 21:27 IST|Sakshi

కోవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారులతో మంత్రి సమీక్ష

సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా కొత్తగా ప్లాంట్లు ఏర్పాటు, మరో 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. మంగళవారం ఆయన కోవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆక్సిజన్ జనరేషన్, స్టోరేజ్‌ల పెంపుపై చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా టీచింగ్ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పీఎస్‌ఏ యూనిట్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బ్లాక్‌ ఫంగస్ కేసులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్ కాటంనేని భాస్కర్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ విజయరామరాజు, స్టేట్ నోడల్ ఆఫీసర్‌ కృష్ణ బాబు పాల్గొన్నారు.

చదవండి: అవాస్తవాలు నమ్మొద్దు: ఎ.కె.సింఘాల్‌
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: మొహం చాటేసిన చంద్రబాబు

మరిన్ని వార్తలు