ఏలూరు ఘటనపై మంత్రి ఆళ్ల నాని సమీక్ష

7 Dec, 2020 19:50 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరు ఘటనపై ప్రభుత్వాసుపత్రిలో డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే అబ్బాయ చౌదరి, కలెక్టర్, వైద్యాధికారులు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ ఈ తరహా కేసులను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు కృషిచేయాలని సూచించారు. తొమ్మిది వార్డులకు ప్రత్యేక డాక్టర్‌ను నియమించడంతో పాటు.. ప్రతి 9 బెడ్లకు ఒక డాక్టర్‌ అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: సర్కారు బాసట.. కోలుకుంటున్నారు)

84 వైద్య శిబిరాలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారం పాటు ఏలూరు పరిసర ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో శానిటేషన్ చేయాలన్నారు. విజయవాడ, గుంటూరు ప్రభుత్వాస్పత్రుల్లో నోడల్ ఆఫీసర్స్‌ నియమించడంతో పాటు, మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని అధికారులను ఆళ్ల నాని ఆదేశించారు. ‘‘చికిత్సపొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి. అన్ని గ్రామ సచివాలయాల్లో వైద్య శిబిరాలు కొనసాగించాలి. అన్నివిధాలా సిద్ధంగా ఉండాలని వైద్యులకు మంత్రి ఆళ్ల నాని సూచించారు. (చదవండి: మనం కట్టేవి ఇళ్లు కావు.. ఊళ్లు: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు