‘చట్ట ప్రకారం అరెస్ట్‌ చేయాలని సీఎం చెప్పారు’

24 May, 2022 13:08 IST|Sakshi

పల్నాడు జిల్లా: హత్య కేసులో ఇరుక్కున్న ఎమ్మెల్సీ అనంతబాబు(అనంత్‌ ఉదయ్‌ భాస్కర్‌) చట్ట ప్రకారం అరెస్ట్‌ చేయాలని సీఎం జగన్‌ చెప్పారని జలవనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు తెలిపారు. మంగళవారం ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టుపై అంబటి మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్సీ అనంతబాబు హత్యకేసులో ఇరుక్కున్నారు. చట్ట ప్రకారం అరెస్ట్‌ చేయాలని సీఎం చెప్పారు. ధర్మం వైపే ఉంటామని ప్రభుత్వం చెప్పింది’ అని తెలిపారు.

కాగా, డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును సోమవారం పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అనంతబాబుకు సుబ్రహ్మణ్యం రూ.25 వేలు ఇవాల్సి ఉందని.. ఇద్దరి మధ్య మాటమాట పెరిగి గొడవ జరిగిందని అరెస్ట్‌ తర్వాత  కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు మీడియాకు తెలిపారు. కోపంతో అనంతబాబు.. సుబ్రహ్మణ్యాన్ని వెనక్కి నెట్టడంతో  గ్రిల్‌ వల్ల అతని తలకు గాయం కావడంతో మృతి చెందినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు