Ambati Rambabu: దుష్ట చతుష్టయం ఎన్ని కుట్రలు చేసినా ఫలితం ఉండదు

30 Jun, 2022 14:24 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: భవిష్యత్ ప్రణాళికపై చర్చించేందుకే పార్టీ ప్లీనరీలు నిర్వహిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జిల్లాలోని వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్లీనరీ అట్టహాసంగా సాగింది. జిల్లా పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన ప్లీనరీ సమావేశం నిర్వహించారు. అగ్రనేతలు పార్టీ జెండా ఆవిష్కరించారు. ఎనిమిది నియోజకవర్గాల నుంచి వేలాదిగా పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ప్లీనరీ సమావేశానికి మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మెన్లు హాజరయ్యారు. కార్యక్రమంలో మొదటగా దివంగత నేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నేతలు నివాళులర్పించారు.

అనంతరం మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. మానిఫెస్టోలోని హామీలన్నీ నెరవేర్చి జనంలోకి వెళుతున్నాము. మూడేళ్లలో 95 శాతం హామీలు నెరవేర్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఎక్కడా లేవు. కులం, మతం, పార్టీ చూడకుండా సంక్షేమం అందిస్తున్నారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ వాళ్లకే సంక్షేమం అందించారు. వైఎస్సార్సీపీ మద్దతు దారులను పక్కన పెట్టారు. కానీ మన ప్రభుత్వం వచ్చాక ఓటు వేయకపోయినా అర్హత ఉంటే సంక్షేమం అందిస్తున్న గొప్ప వ్యక్తి సీఎం వైఎస్ జగన్.

పేదవారి ముసుగులో ఉన్న ధనవంతులకు పథకాలు అందవు. 2024 ఎన్నికల్లో మళ్ళీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావటం ఖాయం. చంద్రబాబు, వైఎస్ జగన్ పాలనకు ప్రజలు వ్యత్యాసం చూసారు. దుష్ట చతుష్టయం ఎన్ని కుట్రలు చేసినా ఫలితం ఉండదు. బాబు మోసాలు తప్ప త్యాగాలు చేయలేదు. ఎవరినో సీఎంని చేసేందుకు పెట్టిన పార్టీ జనసేన. చంద్రబాబు ఎంతమందిని కలుపుకొచ్చినా భంగపాటు తప్పదు. సంక్షేమ సైనికుల అండతో మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాము అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

చదవండి: (బిజినెస్‌ రీఫార్మ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌-2020: ఏపీకి టాప్‌ ప్లేస్‌)

మరిన్ని వార్తలు