చంద్రబాబు.. వాస్తవాలు తెలుసుకో

30 Oct, 2020 12:31 IST|Sakshi

మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

సాక్షి, నెల్లూరు: ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. చంద్రబాబు చెప్పినట్టు ఇక్కడ జరగవని.. ఎన్నికల కమిషన్, ప్రభుత్వం కలిసి సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. ఏకపక్ష నిర్ణయాలు కుదరవన్నారు. శుక్రవారం ఆయన రామ్మూర్తినగర్, ఏఎస్‌నగర్‌లో ‘నాడు-నేడు’ పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా స్కూళ్లను అభివృద్ధి చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. (చదవండి: టీడీపీ స్కెచ్‌.. అంతా తుస్స్‌

చంద్రబాబు ఇంట్లో కూర్చొని విమర్శలు చేయడం కాదని, వాస్తవాలు తెలుసుకోవాలని అనిల్‌ హితవు పలికారు. ‘‘జూమ్‌ మీటింగ్‌లో ఆరోపణలు చేయడం కాదు.. ఒకసారి స్కూళ్ల అభివృద్ధిని చూడండి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తుందో తెలుసుకోవాలి. టీడీపీ హయాంలో పెన్షన్ల కోసం వృద్ధులు చెప్పులు అరిగేలా తిరిగేవారు. సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్‌ పాలన చేస్తున్నారని’’ మంత్రి అనిల్‌కుమార్ పేర్కొన్నారు. (చదవండి: వెలుగులోకి గీతం అక్రమాల చిట్టా)

మరిన్ని వార్తలు