-

కండలేరు జలాశయాన్ని పరిశీలించిన మంత్రి అనిల్‌

10 Oct, 2020 13:11 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ జల వనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ జిల్లా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలిసి కండలేరు జలాశయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కండలేరులో ప్రస్తుత నీటి మట్టం 53 టీఎంసీలు. తెలుగు గంగ చరిత్రలో తొలిసారిగా 60 టీఎంసీల నీటిని నిల్వచేస్తాం. జిల్లాలో ప్రతి గ్రామానికి తాగు, సాగు నీరు అందిస్తాం. వరుసగా రెండేళ్లు జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. జలాశయాల కింద ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలను తక్షణం పునరావాసాలకు తరలించాలి' అని అధికారులకు సూచించారు.  (ఎమ్మెల్యే భూమనకు సీఎం జగన్‌ పరామర్శ )

మరిన్ని వార్తలు