-

పెన్నాపై మరో నాలుగు లైన్ల నూతన బ్రిడ్జి

24 Jan, 2021 14:48 IST|Sakshi

బ్రిడ్జి నిర్మాణానికి రూ. 150 కోట్లుతో కేంద్రానికి ప్రతిపాదనలు

పెన్నా బ్యారేజీ పనులను పరిశీలించిన మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్

సాక్షి, నెల్లూరు: పెన్నా బ్యారేజీ పనులను మంత్రి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరదల వల్ల నాలుగు నెలల పాటు పెన్నా బ్యారేజీ పనులు ఆలస్యం అయ్యాయని మంత్రి అన్నారు. సాధ్యమైనంత త్వరలో బ్యారేజీ పూర్తి చేసి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభింపజేస్తామని తెలిపారు. చదవండి: నిమ్మగడ్డను బెదిరించాల్సిన అవసరం నాకు లేదు

రెండేళ్లలో సిటీ నియోజకవర్గంలో రూ.350 కోట్లు వరకు పనులు జరుగుతున్నాయని వివరించారు. గత టీడీపీ ప్రభుత్వం ఎన్నికల చివరి ఆరు నెలల ముందు మాత్రమే హడావిడి చేసి, మొదటి రెండేళ్లలో నామమాత్రంగా పనులు చేశారని విమర్శించారు. పెన్నా పై మరో నాలుగు లైన్ల నూతన బ్రిడ్జి నిర్మాణానికి 150 కోట్లుతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి వెల్లడించారు. ఎక్కడ రాజీ పడకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టంచేశారు.చదవండి:బాబు జమానాలో అంతులేని నిర్బంధకాండ

మరిన్ని వార్తలు