‘సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు’

25 Dec, 2020 16:35 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : ఈ రోజు(శుక్రవారం) ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగ్గ రోజని, ఒకే రోజు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదేనని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కొనియాడారు. శుక్రవారం నెల్లూరు నగర జాతీయ రహదారి వద్ద ఉన్న లేఅవుట్‌లో పేద మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ గత ప్రభుత్వం ఐదేళ్లలో 2 లక్షల ఇళ్లు ప్రారంభించింది.. వాటిని పూర్తి చేయలేదు. ఇంటి స్థలాల కేటాయింపులో కులం, మతం చూడలేదు. సిపార్సులు అసలు లేవు, అర్హులైన అందరికి ఇళ్లు ఇస్తున్నాము. టీడీపీ కుట్ర రాజకీయాల వల్లే ఇంటి  పట్టాల పంపిణీ జాప్యం అయింది. ( నేటి నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పండగ: సీఎం జగన్‌)

మాట ఇస్తే తప్పని గొప్ప నేత.. మహిళలకు ప్రభుత్వంలో పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు మహిళలు నీరాజనం పలుకుతున్నారు. గతంలో టిడ్కో ఇళ్ల పేరుతో టీడీపీ పేదలను దోచుకోవాలని చూసింది. కానీ, ముఖ్యమంత్రి ఉచితంగా అదే టిడ్కో ఇళ్లు ఇస్తున్నారు. ప్రభుత్వం 14 వేల ఇళ్లు ఇవాళ ఒక రూపాయకే ఇస్తోంది. ఇంటి స్థలాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదు. నగర పరిధిలో 14 వేల ఇంటి పట్టాలు ఇస్తున్నాం. 8 వేల ఇళ్ల నిర్మాణం కూడా చేపడతాం. 70 కోట్లతో పెన్నా బ్యారేజీకి అటు ఇటుగా బండ్ కడతాం.. వరద వచ్చినా కాలనీలకు ప్రమాదం లేకుండా చేస్తా’’మని అన్నారు.

మరిన్ని వార్తలు