‘జగనన్న పాలనలో జలాశయాలకు నిండుదనం’

24 Aug, 2020 12:43 IST|Sakshi

జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

సాక్షి, నెల్లూరు: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా రెండోసారి జలాశయాలకు నిండుదనం వచ్చిందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని జలాశయాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నింపుతామన్నారు. (చదవండి: ఏపీలో కొత్త జిల్లాల ప్రక్రియ ప్రారంభం

‘‘గతంలో దివంగత మహానేత వైఎస్సార్‌ హయాంలో భారీగా వర్షాలు కురిశాయి.  మళ్ళీ జగనన్న పాలనలోనే ఈ  జలాశయాలకు నీళ్లు వస్తున్నాయి. సోమశిల చరిత్రలో గత ఏడాది మొదటి సారి పూర్తి సామర్థ్యం 78 టీఎంసీల మేర నీటిని నింపాం. ఈ ఏడాది కూడా 78 టీఎంసీల మేర నీటిని నింపుతాం. కండలేరు జలాశయానికి కూడా నీటిని విడుదల చేస్తున్నాం. ఈ ఏడాది పంటలకు సమృద్ధిగా నీటిని అందిస్తామని’’ మంత్రి పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకే రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. వర్షాలు కురుస్తుండటంతో రంగు మారే అవకాశం ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.


 

మరిన్ని వార్తలు