'మంచి నాయకుడి పాలనకు ఇదే నిదర్శనం'

19 Sep, 2020 13:52 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: నగరంలోని పెన్నానది పరివాహక ప్రాంతాల్లో మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ' వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుసగా రెండోసారి సోమశిల జలాశయం పూర్తిగా నిండింది. మంచి నాయకుడి పాలనకు ఇదే నిదర్శనం. వర్షాలు బాగా కురుస్తున్నాయి. నెల్లూరులో పెన్నా బ్యారేజీ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తాం. (సచివాలయ పరీక్షలు: నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ)

సోమశిల నుంచి నీటి విడుదల మరింత పెరుగుతుంది. నదీ తీరంలో నివాసం ఉన్న వారు వెంటనే సహాయక శిబిరాలకు వెళ్లాలి. సోమశిల నుంచి నీటి విడుదల పెరిగే అవకాశం ఉండటంతో ఈ ప్రాంతం అంతా మునిగిపోయే అవకాశం ఉంది. తీరంలో నివాసం ఉన్న ప్రజలకు పునరావసం కల్పిస్తాం. త్వరలోనే వీరికి స్థలాలు ఇచ్చి సొంత ఇళ్లు కట్టిస్తాం' అని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు.  (శరవేగంగా నూతన రథం నిర్మాణ పనులు)

మరిన్ని వార్తలు