వరద బాధితులకు ప్రభుత్వం అండ..

27 Nov, 2020 20:32 IST|Sakshi

పునరావాస కేంద్రాలను సందర్శించిన మంత్రి అనిల్‌

సాక్షి, నెల్లూరు: పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆదేశించారు. శుక్రవారం ఆయన పునరావాస కేంద్రాలను సందర్శించారు. ఆహారం, వసతి సౌకర్యాలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. (చదవండి: నివర్‌ తుపాన్‌: రేపు సీఎం జగన్‌ ఏరియల్ సర్వే)

వరద బాధితులకు ఫుడ్‌ ఫ్యాకెట్లు పంపిణీ..
వైఎస్సార్‌ జిల్లా: వరద బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారని ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన వరద బాధితులకు ఫుడ్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నప్రతి ఒక్కరికీ రూ.500 ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారని రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. (చదవండి: ఏపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం)

రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్‌...
హేమాద్రివారిపల్లె వద్ద రెస్క్యూ ఆపరేషన్‌ విజయవంతం అయ్యింది. వరదలో చిక్కుకున్న 130 మందిని ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రక్షించారు. లోతట్టుప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు.

వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో..
నెల్లూరు జిల్లా: పెరమన వద్ద  గిరిజనులు వరదలో చిక్కుకున్నారు. రొయ్యల గుంటలకు కాపలా కోసం వెళ్లిన 11 మంది గిరిజనులు.. ఒక్కసారిగా పెరిగిన వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సంగం జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో నెల్లూరు నుంచి కడప రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

>
మరిన్ని వార్తలు