చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు

26 Sep, 2020 16:23 IST|Sakshi

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

సాక్షి, విశాఖపట్నం: వరల్డ్‌ టూరిజం డే ఉత్సవాలను విశాఖలో నిర్వహిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే ఉత్సవాల ప్రధాన ఉద్ధేశమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో సహజ వనరులు ఉన్నాయని.. 974 కిలో మీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉందని పేర్కొన్నారు. కరోనా వలన టూరిజం ఆదాయం తగ్గిందన్నారు. (చదవండి: భగవంతుణ్ణి, పాలకులను కులమతాల్లో ఇరికించవద్దు)

‘‘గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల టూరిజంలో పెట్టుబడులు రాలేదు. ప్రభుత్వ, పైవేట్ భాగస్వామ్యంతో 12 స్టార్ హోటళ్లు నిర్మించాలని భావిస్తున్నాం. ఐదు కోట్ల మందికి నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఆయనకు కులం, మతం ఆపాదించవద్దని మంత్రి కొడాలి నాని అన్న మాటలను టీడీపీ నేతలు వక్రీకరించారని’’ అవంతి మండిపడ్డారు. ‘‘నా మతం మానవత్వం అని.. నా కులం.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమని’’ గతంలో వైఎస్‌ జగన్‌ చెప్పిన మాటలను మంత్రి అవంతి మరోసారి గుర్తుచేశారు. దేవుళ్లతో రాజకీయాలు చేయడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. (చదవండి: ‘వారికి టీడీపీ వత్తాసు అందుకే..’

మరిన్ని వార్తలు