త్వరలోనే ఏపీలో కరోనా తగ్గుముఖం

31 Jul, 2020 12:26 IST|Sakshi

మంత్రి అవంతి శ్రీనివాస్‌

సాక్షి, విజయవాడ: మహమ్మారి కరోనాకు, మానవాళికి జరుగుతున్న పోరులో కచ్చితంగా మనుషులే విజయం సాధిస్తారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. కరోనా సమాచారంలో ప్రభుత్వం పారదర్శకత పాటిస్తోందని.. అధిక సంఖ్యలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం వల్లే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. వైరస్‌ సోకినా ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మహమ్మారి నుంచి కోలుకోవచ్చని తెలిపారు. పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్‌ శుక్రవారం దుర్గమ్మవారిని దర్శించుకున్నారు.(అభివృద్ధికి టీడీపీ అవరోధం: అవంతి) 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా బారి నుంచి ప్రజలను కాపాడాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు తెలిపారు. కోవిడ్‌​-19 కట్టడికై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తాను సైతం ప్రతినెలా పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. టెస్టులు చేయించుకోవడంలో ఎలాంటి ఇబ్బంది, తప్పు లేదన్నారు. కరోనా సోకినంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదని సరైన జాగ్రత్తలు, ఆత్మస్థైర్యంతో దానిని జయించవచ్చని పేర్కొన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో కేసులు తగ్గుముఖం పడుతాయన్న అవంతి.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రతీ విషయాన్ని తప్పు పట్టడం సరికాదని హితవు పలికారు.  
 

>
మరిన్ని వార్తలు