విశాఖకు వ్యతిరేకంగా పని చేస్తే చరిత్ర హీనులవుతారు: మంత్రి బొత్స

29 Sep, 2022 18:44 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రానికి టీడీపీ అవసరం లేదు. ఉత్తరాంధ్రకు టీడీపీ ఏం చేసిందో చెప్పాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కాగా, మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ‘2024 ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలిచి తీరుతాము. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాము. 

వైఎస్‌ఆర్‌ హయంలోనే విశాఖ అభివృద్ధి జరిగింది. రుషికొండపై ముఖ్యమంత్రి అధికారిక నివాసం కడితే తప్పేంటి?. విశాఖకు పరిపాలన రాజధానిగా వచ్చి తీరుతుంది. రాష్ట్రానికి టీడీపీ అవసరం లేదు. ఉత్తరాంధ్రకు టీడీపీ ఏం చేసిందో చెప్పాలి?. అచ్చెన్నాయుడు మనిషి పెరిగాడు కానీ బుర్ర పెరగలేదు.  విశాఖకు వ్యతిరేకంగా పని చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు’ అని కామెంట్స్‌ చేశారు. అనంతరం.. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలపై బొత్స స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. ఏపీ, తెలంగాణ పీఆర్సీలు పక్కపక్కన పెట్టి చూస్తే తేడా తెలుస్తుంది అని అన్నారు. 
 

మరిన్ని వార్తలు