దుర్మార్గపు ఆలోచనలతోనే ఆలయాలపై దాడులు

8 Jan, 2021 17:47 IST|Sakshi

సర్వమత పెద్దల సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చూసి  ఓర్వ లేక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆయన శుక్రవారం విజయవాడలో జరిగిన సర్వమత పెద్దల సమావేశంలో మాట్లాడారు. అధికారం వచ్చిననాటి నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని చెప్పారు. ప్రజారంజక పాలనను అడ్డుకోవాలని దుష్టశక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొందరు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు.(చదవండి: 'బీజేపీ జై శ్రీరాం‌ కాకుండా చేసిన అభివృద్ధి చెప్పాలి')

‘‘రాష్ట్రంలో 30 లక్షలమందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.దుర్మార్గపు ఆలోచనలతోనే ఆలయాలపై దాడులు చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు చేస్తున్నారు. మత సామరస్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. జీవో తెచ్చి రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసిందని’’ మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.(చదవండి: ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్‌ భూమిపూజ)

సర్వమానవ సౌభ్రాతృత్వం మన సందేశం..
ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ, ఏ మతం కూడా హింసను ప్రేరేపించదన్నారు. సర్వమానవ సౌభ్రాతృత్వం మన సందేశమని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని.. దేవుని దృష్టిలో అందరూ సమానులేనన్నారు. మానవ శాంతి కోసమే మతం అని మత పెద్దలు పేర్కొన్నారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌లో మంచి వాతావరణం నెలకొంది. ఎక్కడా మతపరమైన విద్వేషాలు, మత కల్లోలాలు లేని ఏకైక రాష్ట్రం మనది. అన్ని మతాల వారు కలిసిమెలసి జీవిస్తున్నారు. ఎక్కడా మతపరమైన మెజార్టీ, మైనారిటీ అన్న భావన ప్రజల్లో లేదు. మారుమూల ప్రాంతాల్లోని ఆలయాల్లో ఇటీవల ఆందోళన కలిగిస్తున్న ఘటనలు, విష పూరిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని’’ మత పెద్దలు తెలిపారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు , విమర్శలు చేయడం తగదన్నారు.

మరిన్ని వార్తలు