చంద్రబాబు బాధ్యతగా వ్యవహరించలేదు..

7 Mar, 2021 17:36 IST|Sakshi

మంత్రి బొత్స సత్యనారాయణ

సాక్షి, విశాఖపట్నం: గత చంద్రబాబు పాలనంతా దోపిడీయేనని.. విశాఖ వచ్చి ఆయన ఏదేదో మాట్లాడారని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో పేదవాడికి ఒక్క ఇల్లైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. హుద్‌హుద్ తుఫాన్ వస్తే విశాఖలో భూ రికార్డులు తారుమారు అయ్యాయని.. భూ రికార్డుల తారుమారుపై అప్పటి మంత్రులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారని మంత్రి బొత్స గుర్తు చేశారు.

‘‘వైఎస్సార్‌ హయాంలోనే విశాఖ అభివృద్ధి జరిగింది. ఫార్మాసిటీ కోసం వైఎస్ఆర్‌ హయాంలోనే పునాది పడింది. 30 లక్షల ఇళ్ల పట్టాలను సీఎం జగన్ పాలనలో ఇచ్చాం. విశాఖలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా టీడీపీ కోర్టు కెళ్లింది. ఈ రాష్ట్రాన్ని దోచుకునేందుకు చంద్రబాబు యత్నించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్‌ను 900 కోట్లతో రూపొందించి రూ.400 కోట్ల అప్పులు, మిగిలిన ఆస్తులను జీవీఎంసీకి బాబు తాకట్టు పెట్టారు. టీడీపీ హయాంలో మెట్రోపై ఎప్పుడైనా సమీక్షించారా?. చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించలేదంటూ’’ మంత్రి దుయ్యబట్టారు.

బీజేపీ నేతలు అమృత స్కీమ్‌కు రూ.1150 కోట్లు ఇచ్చామంటున్నారని.. అదే స్కీమ్ కోసం తమ ప్రభుత్వం 72 శాతం వెచ్చించిందని ఆ కేంద్ర మంత్రికి తెలియదా? అని ప్రశ్నించారు. అమృత స్కీమ్ అమల్లో విశాఖ నంబర్ వన్‌ అని కేంద్ర మంత్రి గతంలో అన్నారని మంత్రి బొత్స గుర్తు చేశారు. విశాఖపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.


చదవండి:
ప్రజలపై అక్కసు.. చంద్రబాబు శాపనార్థాలు  
‘బాబు దుర్మార్గం.. టీడీపీ నేతలే నిజాలు కక్కారు’

మరిన్ని వార్తలు