తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు: మంత్రి బొత్స

26 Sep, 2022 19:53 IST|Sakshi

సాక్షి, విజయవాడ: పాదయాత్ర ముసుగులో టీడీపీ చేస్తోంది రియల్ ఎస్టేట్ యాత్ర అని ప్రజలు గ్రహించాలని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన బొత్స.. ‘విశాఖ వచ్చి రాజధాని వద్దు అంటే ఆ ప్రాంత ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు. పాదయాత్రను రైతుల ముసుగులో టీడీపీ చేస్తోంది. అది రియల్ ఎస్టేట్ యాత్ర అని తెలుసుకోవాలి. లాండ్ పూలింగ్‌లో భూములు ఇవ్వడం ఇది మొదటిసారి కాదు కదా? పోలవరంకు ఇస్తే త్యాగం చేసినట్లు. అమరావతిలో భూములు ఇచ్చిన వారికి మంచి పరిహారం ఇచ్చాం. 

అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి మా ప్రభుత్వం విధానం. రైతులకు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం ముందుకెళ్తాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత లెక్కలు తీస్తే ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉంది. ఐదు లక్షల కోట్లు మట్టిలో పోసి తగలెయ్యాలా? 10 వేల కోట్లతో విశాఖ అభివృద్ధి చెందతుంది. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రకు అనేక ప్రాజెక్టులు తెచ్చాను.’ అని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. 

ఇదీ చదవండి: సీఎం జగన్‌ స్పీచ్‌ ముందు ఆ నిరసనలకు విలువే లేకుండా పోయింది

మరిన్ని వార్తలు