ఎంవోయూలు గ్రౌండింగ్‌.. సీఎస్‌ అధ్యక్షతన కమిటీ: మంత్రి అమర్‌నాథ్‌

4 Mar, 2023 16:05 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ సూపర్‌ సక్సెస్‌ అయ్యిందని, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఒకే వేదికపైకి రావడం మొదటిసారి అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. రాష్ట్రానికి 13 లక్షల 5వేల 663 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.

6 లక్షల 3వేల 223 మందికి ఉపాధి లభించనుందన్నారు. ఎంవోయూలు గ్రౌండింగ్‌ అయ్యేలా సీఎస్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఎంవోయూ పారదర్శకంగా రూపొందిందన్నారు.

కాగా, మునుపెన్నడూ చోటు చేసుకుని పరిణామానికి ఆంధ్రప్రదేశ్‌ వేదికైంది. పాలన రాజధాని విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. అడ్డగోలుగా విమర్శించే వాళ్ళ నోళ్లే.. అబ్బురపోయేలా పెట్టుబడుల ప్రవాహం రాష్ట్రానికి పోటెత్తింది.
చదవండి: ఏపీకి పెట్టుబడుల వరద.. శాఖల వారీగా వివరాలు ఇలా.. 

మరిన్ని వార్తలు