ఉద్యాన పంటలను పరిశీలించిన మంత్రి జోగి రమేష్‌

14 May, 2022 12:35 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, కృష్ణా జిల్లా: తుపాను ప్రభావంతో తోట్ల వల్లూరు మండలంలో నష్టపోయిన ఉద్యానవన పంటలను మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ శనివారం పరిశీలించారు. నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బాధిత రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు. వ్యవసాయం దండగన్న టీడీపీ నేతలు, స్టీరింగ్ కమిటీ అంటూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. రైతాంగ సంక్షేమానికి నాడు వైఎస్సార్‌, నేడు జగన్ ఎంతో కృషి చేశారన్నారు.
చదవండి: జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులపై నోరు పారేసుకున్న చంద్రబాబు

మరిన్ని వార్తలు