‘21 రోజుల్లో రైతుల బ్యాంక్‌ అకౌంట్‌లో ధాన్యం సొమ్ము’

6 Jun, 2021 19:11 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొనుగోలు చేసిన ధాన్యం సొమ్మును 21 రోజుల్లో రైతుల బ్యాంక్‌ అకౌంట్‌లో వేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని వ్యవ‌సాయశాఖ మంత్రి కుర‌సాల‌ కన్నబాబు స్పష్టం చేశారు.  ఇప్పటివరకూ 24 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..  మిల్లర్లు, దళారులను రైతులు నమ్మొద్దని సూచించారు. 

ఆర్‌బీకేలకు వెళ్లి కనీస మద్దతు ధరకే ధాన్యం విక్రయించుకోవాలన్నారు. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న రకాలనే రైతులు సాగు చేయాలి అందుకు సంబంధించిన విత్తనాలను కూడా సిద్ధం చేశామని తెలిపారు. వ్యవసాయ సలహా మండలి నియామకం పూర్తయిందని పేర్కొన్నారు. వ్యవసాయ సలహా మండలిలో రైతులను భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. సలహా మండలితో చర్చించి విధాన నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

చదవండి: గ్రామ వాలంటీర్‌ వ్యవస్థ: ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానం

మరిన్ని వార్తలు