40 వేల హెక్టార్లలో పంట న‌ష్టం : క‌న్న‌బాబు

17 Oct, 2020 15:19 IST|Sakshi

గండ్లు పడిన ప్రదేశాల్లో శాశ్వత పరిష్కారం  

తూర్పు గోదావ‌రి : వ‌ర‌దల కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు జిల్లాలో 40 వేల హెక్టార్లలో వరిపంటకు నష్టం వాటిల్లింద‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి క‌న్న‌బాబు తెలిపారు. వ‌ర‌ద‌ల‌తో గండ్లు ప‌డిన ప్రాంతాల‌ను ప‌రిశీలించిన మంత్రి దీనికి శాశ్వత పరిష్కారం చూపుతామ‌ని పేర్కొన్నారు. గండ్లు పడిన చోట పూడ్చివేత పనులు చేపట్టాలని అధికారుల‌ను ఆదేశించారు. ఏలేరు వరదలతో పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని,  ఉద్యానవన పంటలు కుళ్లిపోయిన పరిస్థితి,  తీవ్రంగా ఉంద‌ని తెలిపారు. పంట న‌ష్ట‌పోయిన రైతుల‌ను ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందజేస్తున్నామ‌ని తెలిపారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహాయక చర్యల్లో యాక్టివ్‌గా పనిచేస్తున్నారని మంత్రి  వెల్ల‌డించారు. 
 

మరిన్ని వార్తలు