మంత్రి కారుమూరి ఔదార్యం 

26 Apr, 2022 11:37 IST|Sakshi

తణుకు అర్బన్‌: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కళాశాల విద్యార్థినికి వైద్యం చేయించి సొంత వాహనంలో సురక్షితంగా ఇంటికి చేర్చారు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. సోమవారం సాయంత్రం రేలంగిలో వలంటీర్ల సత్కార సభ ముగించుకుని తణుకు వస్తుండగా రోడ్డుపై పడి ఉన్న పాలి గ్రామానికి చెందిన విద్యార్థిని మీనాను ఆయన చూశారు.

వెంటనే తన కాన్వాయ్‌ని నిలిపి ఆమెకు సపర్యలు చేసి రేలంగిలో వైద్యం అందించారు. అనంతరం తన వాహనంలో ఆమెను ఇంటికి పంపి ఔదార్యం చూపించారు.
 

మరిన్ని వార్తలు