వైద్య రంగానికి సీఎం జగన్‌ పెద్దపీట: కొడాలి నాని

2 Sep, 2021 12:29 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రారంభించిన మంత్రి కొడాలి నాని

సాక్షి, కృష్ణా జిల్లా: వైద్య రంగానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రూ.50 లక్షల నిధులతో నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రూ.1600 కోట్లతో శిథిలావస్థలోఉన్న ఆసుపత్రులను పునర్‌ నిర్మిస్తున్నామన్నారు. గ్రామస్థాయి నుంచే వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదమా లాంటి సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని మంత్రి కొడాలి నాని అన్నారు.

ఇవీ చదవండి:
వైఎస్సార్ ఆచరణలో నుంచి ఓ మహావృక్షం పెరిగింది: సజ్జల 
బిగ్‌బాస్‌-13 విన్నర్‌, చిన్నారి పెళ్లి కూతురు ఫేం సిద్ధార్థ్‌ శుక్లా హఠాన్మరణం 

మరిన్ని వార్తలు