ప్రతి ఏటా ఉద్యానవన విస్తీర్ణం పెరుగుతోంది: మంత్రి కన్నబాబు

13 Aug, 2021 18:48 IST|Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఏటా ఉద్యానవన విస్తీర్ణం పెరుగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాగా, శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యానవన రంగంలో రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలని.. కొబ్బరి పంటలపై నిరంతరం అధ్యయనం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారని పేర్కొన్నారు.

 కొబ్బరి, అరటి, బొప్పాయి, మిరప, టమాట, ఉల్లి పంటలపై ప్రత్యేక దృష్టిపెట్టామని తెలిపారు. అదేవిధంగా.. అరటి, మిరప సాగులో మంచి ఫలితాలు సాధిస్తున్నామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు