చంద్రబాబు ఎగొట్టిన సొమ్మును సీఎం జగనే చెల్లించారు..

24 Nov, 2020 18:12 IST|Sakshi

వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు

సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు ఎగొట్టిన రైతుల బీమా సొమ్మును కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లించారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏ సీజన్‌లో పంటనష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం చెల్లించే విధంగా సీఎం జగన్‌ చర్యలు తీసుకున్నారని తెలిపారు. రైతులకు సహాయం చేసేందుకు గ్రామస్థాయిలో సలహా కమిటీలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. (చదవండి: రైతు పక్షపాతి సీఎం జగన్‌)

‘‘ఈ సారి రబీ కోసం 121 రోజులు నీరు అందిస్తాం. సాగునీటితో పాటు తాగునీటి అవసరాలకు కూడా నీరు అందిస్తాం. ఇరిగేషన్ మెయింటెనెన్స్ పనులు వేగవంతం చేస్తాం. ఈ సారి రైతులు షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ వేసుకోవాలి. కొన్ని పత్రికలు ప్రజలను గందరగోళ పరిచే విధంగా కథనాలు రాస్తున్నాయి. రైతుల బకాయిలు 277 కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకంతో రైతులకు ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ క్రాప్‌లో ఒక్కసారి నమోదు చేసుకుంటే చాలు. 30 పంటలను బీమా కోసం నోటిఫై చేశాం. ఇరవై ఒక్క పంటలు దిగుబడి ఆధారంగా 9 పంటలను వాతావరణ ఆధారంగా గుర్తించాం. ఏపీ ఇన్సూరెన్స్ కంపెనీ రూపుదిద్దుకుంటుంది. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి ఏపీ పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారు. వరదల్లో ఆయన కొడుకు ట్రాక్టర్ ఎక్కారు.. అది కాస్త కొల్లేరులోకి వెళ్ళింది. చంద్రబాబు ఇది నా మార్కు పథకం అని ఒక్కటైనా చెప్పగలరా అంటూ మంత్రి కన్నబాబు ఛాలెంజ్ విసిరారు. (చదవండి: సంక్షేమంలో ముందున్నాం: సజ్జల

మరిన్ని వార్తలు