కన్నబాబుకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం కేటాయింపు

4 Sep, 2020 15:38 IST|Sakshi

సాక్షి, అమరావతి :  వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబుకు రాష్ట్ర ప్రభుత్వం బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం కేటాయించింది. భద్రతా కారణాలరీత్యా ఇంటెలిజెన్స్‌ నివేదిక మేరకు హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పది రోజుల క్రితం మంత్రి కన్నబాబుకు బీపీ (బుల్లెట్ ప్రూఫ్) వాహనం కేటాయించాలని ఇంటెలిజెన్స్‌ వర్గాలు నివేదిక ఇచ్చాయి. ఇక నుంచి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలోనే ప్రయాణాలు, పర్యటనలు చేపట్టాలని మంత్రికి ఇంటెలిజెన్స్‌ వర్గాలు సూచించాయి.

మరిన్ని వార్తలు