‘టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది’

1 Jun, 2021 18:38 IST|Sakshi

తాడేపల్లి:  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌  జగన్‌మోహన్‌రెడ్డి రెండేళ్ల పాలన ప్రజా సంక్షేమానికి సూచిక అని మంత్రి కురసాల ​ కన్నబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ అందిస్తున్న సుపరిపాలనను చూసి ఓర్వలేక చంద్రబాబు, లోకేష్​లు నోటికొచ్చినట్లు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు. 

అయితే,  టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి దిగువ నేతల వరకు వారి పార్టీ ఉనికిపై ఆందోళనగా ఉన్నారని అన్నారు.  ప్రాజెక్టుల పేరుతో రూ. 68 వేల కోట్లను టీడీపీ నేతలు దోచేశారని పేర్కొన్నారు. కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం  సంక్షేమ పథకాల పేరుతో రూ.1.31 లక్షల కోట్లను ప్రజలకు అందించామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చామని చెప్తున్న రూ.1.50 లక్షల కోట్ల గురించి యనమల చెప్పాలని డిమాండ్​ చేశారు. టీడీపీ కేవలం అవినీతి కార్యక్రమాల కోసమే ప్రభుత్వ, ప్రజా ధనాన్ని ఖర్చు చేసిందని కన్నబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. 
 

మరిన్ని వార్తలు