Vanijya Utsavam 2021: పెట్టుబడులతో వచ్చే వారికి స్వాగతం: కన్నబాబు

22 Sep, 2021 12:26 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి రెడ్‌ కార్పెట్‌తో స్వాగతం పలుకుతాము అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఎగుమతుల అవకాశాలపై ఆయన చర్చించారు. విజయవాడలో జరుగుతున్న వాణిజ్య ఉత్సవం కార్యక్రమం రెండురోజులో భాగంగా బుధవారం కన్నబాబు ప్రసంగించారు. సీఎం జగన్‌ పారిశ్రామికాభివృద్ధి కోసం సులభతరమైన పాలసీలను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతున్నాం అన్నారు కన్నబాబు. 
(చదవండి: పెట్టుబడులు పెట్టండి.. రాష్ట్రంతో పాటు మీరూ వృద్ధి చెందండి: సీఎం జగన్‌)

‘‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయానికి , అనుబంధ రంగాల పరిశ్రమల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. సీఎం జగన్ సమర్ధవంతమైన పాలనలో కోవిడ్ సమయంలోనూ ఏపీలో ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. దేశం మొత్తం ఎగుమతుల్లో 5.8% వాటాతో ఎగుమతుల్లో 4వ ర్యాంకులో ఏపీ నిలిచింది. 2020-21లో రాష్ట్రంలోని పోర్టుల నుంచి 172 మిలియన్ టన్నుల ఎగుమతులు జరిగాయి. ఫుడ్ ప్రోసెసింగ్ క్లస్టరులను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి పంట ఉత్పత్తులకు అదనపు విలువ చేకూరుస్తున్నాం’’ అని కన్నబాబు తెలిపారు.

చదవండి: పారిశ్రామికవేత్తలకు అవార్డులతో ముఖ్యమంత్రి సత్కారం

మరిన్ని వార్తలు