అర్హతే ప్రామాణికంగా పింఛన్లు: మంత్రి పెద్దిరెడ్డి

8 Mar, 2022 20:22 IST|Sakshi

సాక్షి, విజయవాడ: పాదయాత్రలో మహిళలు చెప్పిన అన్ని అంశాలను సీఎం జగన్ గుర్తుంచుకున్నారని.. అందుకే మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతీ అంశాన్ని నెరవేరుస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విజయవాడలో సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు.

చదవండి: సీఎం వైఎస్‌ జగన్‌పై సినీ ఇండస్ట్రీ పెద్దల ప్రశంసలు

‘‘ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ప్రతీ పథకంలో మహిళలను భాగస్వామ్యులను చేశారు. ఏపీలో 35లక్షలకు పైగా కేవలం మహిళలకే పింఛన్లు ఇస్తున్నాం. ఏ రాష్ట్రంలోనూ ఏపీలో మాదిరిగా పెన్షన్లు ఇస్తున్న దాఖలాలు లేవు. అర్హతే ప్రామాణికంగా పింఛన్లు అందిస్తున్నారు. 50 శాతం రాజకీయ, ఉద్యోగ రిజర్వేషన్లు ఏపీలో తప్ప దేశంలో ఎక్కడా లేవు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. మహిళల కోసం దిశ యాప్ , దిశ చట్టం రూపొందించారు. సీఎం వైఎస్‌ జగన్‌కు, ప్రభుత్వానికి మహిళల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని’’ పెద్దిరెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు