సిగ్గుంటే రాజీనామా చెయ్..‌

12 Mar, 2021 07:52 IST|Sakshi

రఘురామకృష్ణరాజుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్‌

ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని ఇంకెన్నాళ్లు కుట్రలు చంద్రబాబూ?

తిరుపతి తుడా: వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని రఘురామ కృష్ణరాజు సీఎం జగన్‌ భిక్షతోనే ఎంపీ అయ్యారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయనకు సిగ్గుంటే తక్షణమే ఆ పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీ గుర్తుతో గెలిచి.. మరో పార్టీకి మద్దతిచ్చేలా మాట్లాడడాన్ని చంద్రబాబు నుంచి రఘురామ కృష్ణరాజు నేర్చుకున్నట్లున్నారని వ్యాఖ్యానించారు. అతని పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టం లేదని.. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నందున స్పందిస్తున్నానని చెప్పారు.

రూ.1,000 కోట్లకు పైగా బ్యాంకులను మోసగించిన నీచుడి గురించి మాట్లాడడం సిగ్గుగా ఉందన్నారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఇంకెన్నాళ్లు కుట్రలు చేస్తావని చంద్రబాబును ప్రశ్నించారు. తన మాటలను ఏబీఎన్‌ రాధాకృష్ణ తరచూ వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్నదే చంద్రబాబు, రాధాకృష్ణల లక్ష్యమన్నారు. బాబుకు ప్రజల మీద నమ్మకం లేదని.. కేవలం నయవంచన, వెన్నుపోటుల ద్వారా అధికారంలోకి రావడమే ఆయనకు తెలిసిన విద్య అని విమర్శించారు. బాబు, ఎల్లోమీడియా మాయమాటల్ని ప్రజలు గుర్తించి ఎన్నికల్లో బుద్ధి చెబుతున్నారన్నారు.
చదవండి: 
మహిళా సర్పంచ్‌ కుటుంబంపై టీడీపీ నేత దాడి
నాటి నుంచి నేటి వరకు.. ప్రజాపథమే అజెండా

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు