కోటి మొక్కలు నాటాలన్నదే లక్ష్యం: మంత్రి పెద్దిరెడ్డి

17 Aug, 2021 19:35 IST|Sakshi

అన్ని జిల్లాల అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆగస్టు 31 నుంచి మొక్కలు నాటడం ప్రారంభించాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ కూడా చూసుకోవాలన్నారు. నాటిన మొక్కలు చనిపోతే సర్పంచ్, అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

ఇవీ చదవండి:
గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటనలో ట్విస్ట్
రమ్య హత్య కేసు: హెడ్‌ కానిస్టేబుల్‌ ధైర్య సాహసాలు

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు