‘మాది సంక్షేమ ప్రభుత్వం.. గర్వంగా చెప్పగలం’

6 Apr, 2022 14:19 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉద్యోగుల పట్ల ప్రేమ ఉండబట్టే 27 శాతం ఐఆర్ ఇచ్చారని.. రాష్ట్ర ఆర్థిక పరిస్ధితి వల్లే పీఆర్సీపై ఉద్యోగులతో సంప్రదింపులు చేయాల్సి వచ్చిందని మంత్రి పేర్నినాని తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ సర్ణోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ,  50 ఏళ్లగా ఒక్కటే యూనియన్‌గా నడపటం అభినందనీయమన్నారు. తమ వెంట నడిచిన ఉద్యోగులను ఎప్పటికీ గుర్తించుకుంటామని చెప్పారు.

మాది సంక్షేమ‌ ప్రభుత్వం: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌
ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ.. దేశంలోనే ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఉన్నత స్ధితిలో ఉందని, వాణిజ్య పన్నుల శాఖకు సీఎం వైఎస్ జగన్ పూర్తి సహకారం అందించారన్నారు. 2019లో వైఎస్సార్‌సీపీ భారీ మెజార్టీ రావడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని కొనియాడారు. తమ ప్రభుత్వం సంక్షేమ‌ ప్రభుత్వం అని గర్వంగా చెప్పగలమన్నారు. ఉద్యోగుల సహకారంతోనే రాష్ట్ర అభివృద్ది జరిగిందన్న ఆయన.. ఉద్యోగుల సంఘ నాయకుడిగా సూర్యనారాయణ మంచి పనితీరు కనబరిచారని ప్రశంసించారు.

అడగకుండానే  27 శాతం ఐఆర్ ఇచ్చాం: సజ్జల రామకృష్ణారెడ్డి
రెండు, మూడు దశాబ్దాలుగా ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తర్వాత మర్చిపోవడం ఒక ట్రెండ్‌గా వస్తోందని, సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం, అభివృద్ధిని ప్రజా సంక్షేమంతో కలిసి చూస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అడగకుండానే  ప్రభుత్వం 27 శాతం ఐఆర్ ఇచ్చిందన్న ఆయన.. ఇవ్వగలం అనే ఉద్దేశ్యంతోనే సీపీఎస్ రద్దు వంటి హామీలు ఇచ్చామని, కానీ కోవిడ్ కారణంగా రాష్ట్ర ఆదాయం పై తీవ్ర ప్రభావం చూపించిందని చెప్పారు. ఉద్యోగుల సంక్షేమం చూడటం బాధ్యతగా భావిస్తామని సజ్జల అన్నారు.

మరిన్ని వార్తలు