నవరత్నాలతో ప్రతీ ఎస్సీ కుటుంబానికి లబ్ధి.. అసెంబ్లీలో మంత్రి విశ్వరూప్‌

24 Nov, 2021 09:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతీ ఎస్సీ కుటుంబానికి నవ రత్నాల ద్వారా లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ సంక్షేమంపై స్వల్ప కాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నామన్నారు. అమ్మ ఒడి అద్భుతమైన పథకం. ఏడాదికి రూ.15వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు.

చదవండి: తమాషా చేస్తున్నావా?.. డ్యూటీ అంటే లెక్కలేదా?

వైఎస్సార్‌ చేయూత ద్వారా ఐదేళ్లలో రూ.75 వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం. 5 లక్షల మంది లబ్ధిదారులకు వైఎస్సార్‌ చేయూతతో లబ్ధి చేకూరుతుంది. ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం రాష్ట్రంలో 1070 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. దాదాపు లక్ష మంది ఎస్సీ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించామని మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు