‘నా మాటల వల్ల ఎవరైనా బాధ పడితే క్షమించండి’

28 Mar, 2021 18:38 IST|Sakshi

సాక్షి, తిరుపతి : తాను రైతులను కించపరచలేదని, కౌలు రైతుల వరకు ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే మాట్లాడానని మంత్రి రంగనాథరాజు అన్నారు. తానూ ఓ రైతు బిడ్డనేనని, రైతుల కష్టాలు తెలిసినవాడినేనని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నా మాటల వల్ల ఎవరైనా బాధ పడితే క్షమించండి. నా మాటలను వెనక్కి తీసుకుంటున్నా’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు