'కోర్టు కేసులతో 6 నెలల నుంచి ఆపుతున్నారు'

19 Sep, 2020 11:28 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: ద్వారకా తిరుమల వెంకన్నను శనివారం రోజున రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు దర్శించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు, వేదపండితులు, వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనం పలికి ప్రసాదాలను అందజేసారు.

దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'గుళ్లపై కూడా ప్రతిపక్ష నేతలు రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా టీడీపీ వారితో కోర్టులో కేసులు వేసి 6 నెలల నుంచి ఆపుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఒక సెంటు భూమి కూడా పేదలకు పంచిన పాపాన పోలేదు. ఇప్పటికే రాష్ట్రంలో 15 లక్షలు ఇళ్లు శాంక్షన్ అయ్యాయి. కోర్టు నుంచి అనుమతి రాగానే మరో 15 లక్షల ఇళ్లు పంపిణీ చేస్తాం. సొంతంగా ఇల్లు నిర్మించుకోలేని పేదలకు ప్రభుత్వం నిర్మించి ఇస్తుంది' అని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు