బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు.. జ‌గ‌నన్న ముందు కాదు: మంత్రి రోజా కౌంటర్‌

25 Sep, 2022 08:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌పై చెప్పులేసిన వారు, వెన్నుపోటుదారులు ఆయన భక్తులమని చెప్పుకోవటం విడ్డూరంగా ఉందని ఇప్పటికే పలువురు రాష్ట్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. హెల్త్‌ వర్సిటీకి మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు పెట్టడాన్ని తప్పు పట్టే నైతిక అర్హత వారికి లేదన్నారు. 

ఈ వ్యవహారంపై సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణకు పర్యాటక శాఖ మంత్రి రోజా కౌంటర్‌ ఇచ్చారు. ట్విట్టర్‌ వేదికగా మంత్రి రోజా.. ‘బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు... జ‌గ‌న్ అన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ"గన్" అనే రియల్ సింహం.. తేడా వస్తే దబిడి దిబిడే..!!’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

మరిన్ని వార్తలు