Minister RK Roja: ఆరోజు ధర్నాలు ఎందుకు గుర్తుకు రాలేదు: ఆర్కే రోజా

27 Apr, 2022 10:54 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: మహిళా సాధికారత దిశగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆమె తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల్లో 75 శాతం వాటా మహిళలదే అని తెలిపారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ మహళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలిపారు.

టీడీపీ.. మహిళా ద్రోహి పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో కన్నా ఉన్మాదులు దేశంలో ఎక్కడైనా ఉ‍న్నారా? అని సూటిగా ప్రశ్నించారు. సీఎం జగన్‌ ఇమేజ్‌ను దిగజార్చాలని టీడీపీ బూతు పురాణంతో మాట్లాడుతోందని మండిపడ్డారు. దమ్మున్న నాయుకుడు సీఎం జగన్‌ అని అన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మహిళల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు.

దిశా పోలీస్ స్టేషన్లను పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రశంసించిందని మంత్రి రోజా గుర్తుచేశారు. చంద్రబాబు మహిళల కోసం ఒక్క పథకమైనా తెచ్చారా? అని నిలదీశారు. మహిళల సాధికారతకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్ అని కొనియాడారు. చంద్రబాబు ఎందుకు నిరసనలు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అశోక్ జైన్ అనే టీడీపీ కార్పొరేటర్ అఘాయిత్యానికి పాల్పడితే ఆ రోజు చంద్రబాబు ఎందుకు నిరసనలు చేయలేదు? అని ప్రశ్నించారు.

లోకేష్ పీఏ పార్టీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ రోజు ధర్నాలు ఎందుకు చేయలేదని రోజా నిలదీశారు. సీఎం జగన్‌, వైఎస్‌ భారతి గురించి తప్పుడు మాటలు మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. టీడీపీ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బూటు కాలితో మహిళలను కొడతాడని, వాళ్లు కాదా ఉన్మాదులని మండిపడ్డారు.
చదవండి: అత్యాచార ఘటనపై చంద్రబాబు రాజకీయం

మరిన్ని వార్తలు