Womens Day 2023: ప్రతీ ఒక్కరూ ఆడ పిల్లలను గౌరవించాలన్నారు.

7 Mar, 2023 15:37 IST|Sakshi

సాక్షి, గుంటూరు జిల్లా: దిశా యాప్‌తో మహిళలకు భద్రత, భరోసా వచ్చిందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ప్రతీ మహిళ దిశా యాప్‌ను వినియోగించుకోవాలన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఘటనను చూసి ఏపీలో దిశ చట్టం చేసిన వ్యక్తి సీఎం జగన్ అని ఆమె అన్నారు. ప్రతీ ఒక్కరూ ఆడ పిల్లలను గౌరవించాలన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విశిష్ట పురస్కారం అందుకోవడం తన  అదృష్టమని, ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని మంత్రి రోజా అన్నారు.

‘‘నేను ఎంచుకున్న రెండు రంగాలు సవాళ్లతో కూడుకున్నవి. పురుషాధిక్యత ఉన్న ఈ రంగాల్లో రాణించేందుకు నా తండ్రి, సోదరులు, భర్త అండగా నిలిచారు. నాకు తోడబుట్టకపోయినా నేనున్నానని భరోసా కల్పించిన అన్న సీఎం జగన్‌. కష్టాన్ని నమ్ముకున్నోళ్లకు సక్సెస్ వచ్చి తీరుతుంది. చాలా మంది ఇళ్లల్లో ఆడ పిల్లంటే చిన్నచూపు ఉంటుంది. మగ పిల్లాడిని ఒకలా.. ఆడ పిల్లను మరోలా చూస్తారు. ఇల్లు, బడి, ఉద్యోగం అన్ని చోట్లా మహిళలను గౌరవించాలి’’ అని మంత్రి రోజా పిలుపునిచ్చారు.
చదవండి: మంత్రులు, అధికారులను అభినందించిన సీఎం జగన్‌ 

మరిన్ని వార్తలు